విష్ణుప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ .. వాడి హగ్గుకి అలవాటు పడిపోయా!
on Nov 28, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో వేస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనగానే టపీమని విష్ణుప్రియ అని చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరంటే పృథ్వీ.. మరి వీళ్ళేం చేశారో వీరికి ఓట్లు వేసే జనాలకే తెలియాలి. బిగ్ బాస్ హౌస్ ని ఎంత ఛంఢాలం చేయాలో అంతా చేస్తున్న వీరిద్దరి గురించి బయటైతే మరీ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మన కళామతల్లి ముద్దుబిడ్డ , నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ తన మాజీ ప్రేమికుడి గురించి ప్రేమికుడు గాని ప్రేమికుడు పృథ్వీతో చెప్పుకొచ్చింది. అదేంటో ఓ సారి చూసేద్దాం..
నాకు లాస్ట్ కలలో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడంటూ విష్ణుప్రియ చెప్పగానే.. ఏంటి ఆ కల? చెప్పలేనంత కలా అని పృథ్వీ అడిగాడు. దీనికి నో ఎలా హర్ట్ అయ్యాడు.. అంటే ఇదంతా చూసి ఎంత బాధపడి ఉంటాడా అని వచ్చిందంటూ విష్ణు చెప్పింది. ఎందుకు అలాంటిది నువ్వేం చేశావంటూ పృథ్వీ అడిగాడు. దీనికి అంటే ఆ బ్రేకప్ నుంచి నేను మూ అయిపోయా కదా.. 1 పర్సెంట్ కూడా ఆలోచించకుండా పృథ్వీ పృథ్వీ అంటూ తిరగుతున్నా కదా.. అంటూ విష్ణు చెప్పింది. ఓకే నువ్వు అలా మూ ఆన్ అవుతున్నావనా.. బ్రేకప్ నువ్వే చేసుకున్నావా.. అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి అందరితో నేనే చేసుకున్నానంటూ విష్ణు అనేసరికి ఆ అంటూ అవాక్కయ్యాడు పృథ్వీ. నేనే చేసుకున్నానంటూ మరోసారి విష్ణుప్రియ చెప్పింది.
తనకి నువ్వు ఇంకా కావాలా.. అతను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా.. అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి పాపం తెలీకుండా రెండు తప్పులు చేశాడు.. నా మంచి కోసం చేశాడు నాకు తెలిస్తే భరించలేనని .. కానీ నాకు తెలిసింది నిజంగా భరించలేకపోయాను.. నా దగ్గర కొన్ని విషయాలు దాచాడు.. ఎందుకంటే అవి నాకు నచ్చవని.. అది ఒకసారి చేశాడు. మళ్లీ రెండోసారి చేశాడు. నా ముఖం మీద చెప్పే గట్స్ అతనికి లేవు.. అలా గట్స్ లేని వ్యక్తితో ఉండాలని నాకు అనిపించలేదు.. జనవరి నుంచి ఇంక వైబ్స్ వచ్చేస్తున్నాయ్ నాకు.. ఇక స్టాప్ చేసేయాలి ఇది అని.. ఇది ఇక వర్కవుట్ అవ్వదని తెలిసి బ్రేకప్ చెప్పేశానంటూ విష్ణు తన బ్రేకప్ స్టోరీ చెప్పసాగింది.
నా తల్లి ప్లేస్ తీసుకున్నాడు కాబట్టి అతడ్ని చూడకుండా అయితే నేను ఉండలేకపోతున్నాను.. మా అమ్మ హగ్స్ తర్వాత మళ్లీ అలాంటి ప్రేమ తన హగ్స్ లోనే నాకు తెలిసింది..అతన్ని చూడాలని ఉంది.. అతనే నా బలం.. మా మమ్మీ ప్రేమించినంత ప్యూర్‌గా నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. మొన్న నువ్వు నన్ను మూస్కో అంటే నాకు ఆయనే గుర్తొచ్చాడు.. అసలు నన్ను ఎలా ట్రీట్ చేసేవాడు.. ఇలా నువ్వు అనడం విన్నా కూడా వాడు చచ్చిపోతాడంటూ పృథ్వీతో విష్ణు చెప్పుకొచ్చింది.
Also Read